సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

Both States
Advertisement
  • జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి
  • విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన
  • పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది
  • తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసిన ధర్మాసనం
Advertisement
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా? లేదా? అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది.

శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చారా? లేదా? అన్నదే ముఖ్యం కానీ, ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు. ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని, ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు.

అయితే, శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పాత నేరానికి కొత్తగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీవోపీటీ అనుమతి ఇవ్వడం చెల్లదని వాదించారు. దాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం కూడా సరైంది కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

Srilakshmi IASJagan illegal assets casePenna CementsCBI High CourtQuash petitionCorruption case APVivek Reddy lawyerACB ActIAS officer

More Telugu News

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

27 Oct, 16:44

మా ప్లాన్ చాలా సింపుల్.. వైభవ్ తో ఓపెనింగ్ పై అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

27 Oct, 16:24

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఫార్మా, రియల్టీ షేర్లలో జోరు!

27 Oct, 16:23

దుబాయ్ ఐఫోన్ కోసం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి నిరసన.. అసలేం జరిగింది?

27 Oct, 16:13

కాకినాడకు 167 కి.మీ. దూరంలో 'అర్ణబ్.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

27 Oct, 15:55

కొత్తగా రూ.1,000 నోటు వస్తోందా? వైరల్‌ వార్తలపై కేంద్రం కీలక ప్రకటన

27 Oct, 15:50

భారత్‌లో అతిపెద్ద జిల్లా ఇదే.. కొన్ని రాష్ట్రాలు, దేశాల కన్నా పెద్దది!

27 Oct, 15:48

వెల్లింగ్టన్‌లో అభిషేక్ సునామీ.. రికార్డుల మోతతో సిరీస్ భారత్ కైవసం

27 Oct, 15:45

అభి‘షేకింగ్‌’.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

27 Oct, 15:26

నా బయోపిక్ నిజం కాదు.. అందులో చూపించింది 10 శాతమే.. అసలు కథ వేరు: మేరీ కోమ్

27 Oct, 15:19

అర్ణబ్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో పూర్తిగా మారిన వాతావరణం

27 Oct, 15:08

భారత చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి? కేంద్రం కీలక ప్రకటన!

27 Oct, 15:03

మాజీ మిస్ స్విట్జర్లాండ్‌పై ట్రంప్ అత్యాచారం.. డెమోక్రాట్ల రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

27 Oct, 15:01

అర్ణబ్ తుపాను ప్రభావం: పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

27 Oct, 14:39
..More Telugu News