iBomma Ravi: 'ఐబొమ్మ' క్లౌడ్‌లో 21 వేల సినిమాలు.. విచారణలో విస్తుపోయే నిజాలు!

iBomma Case 21000 Movies Found in Imandi Ravi Cloud Server
  • ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి మళ్లీ పోలీసుల కస్టడీకి
  • విచారణలో బయటపడ్డ 21 వేల పైరసీ సినిమాలు
  • క్లౌడ్ సర్వర్‌లో భారీగా డేటాను గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • డొమైన్ కొనుగోలుకు సంబంధించిన బిల్లులు స్వాధీనం
  • మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న విచారణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నిర్వాహకుడు ఇమంది రవిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న అతడిని గురువారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

విచారణ సందర్భంగా ఐబొమ్మ వెబ్‌సైట్ కోసం డేటాను ఎలా నిర్వహించాడు, పైరసీకి అనుసరించిన పద్ధతులపై అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు స‌మాచారం. ఈ క్రమంలో నిందితుడి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో క్లౌడ్ సర్వర్‌ను తెరిచి చూడగా, అందులో ఏకంగా 21 వేల పైరసీ సినిమాలు భద్రపరిచి ఉన్నట్లు గుర్తించి అధికారులు నివ్వెరపోయారు. 

అలాగే రవి ఈ-మెయిల్‌ను పరిశీలించగా, ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించిన డొమైన్లను కొనుగోలు చేసిన బిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలు కేసులో కీలకం కానున్నాయి. నిందితుడిని మరో రెండు రోజుల పాటు విచారించాల్సి ఉందని, ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


iBomma Ravi
iBomma
iBomma website
piracy website
Imandi Ravi
Hyderabad Cybercrime Police
Telugu movies
movie piracy
cloud server
pirated movies

More Telugu News