: ఉబెర్ డ్రైవర్ వేధించాడంటూ ‘ఎక్స్’ లో ఢిల్లీ మహిళ పోస్ట్.. సోషల్ మీడియాలో చర్చ
- పోలీస్, ఉబెర్ హెల్ప్ లైన్ నుంచి సాయం అందలేదని ఆవేదన
- ఆసుపత్రికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నట్లు వెల్లడి
- డ్రైవర్ తనపై దాడి చేసి చేతిని మెలిపెట్టాడని ఆరోపణ
దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా ప్రయాణికురాలికి ఉబెర్ డ్రైవర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఆసుపత్రికి బయలుదేరిన తనపై ఉబెర్ డ్రైవర్ దాడి చేశాడని, తన చేతిని మెలిపెట్టాడని బాధిత మహిళ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీస్ హెల్ప్ లైన్ కానీ ఉబెర్ హెల్ప్ లైన్ నుంచి కానీ తనకు ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు.
ఎలాగోలా తానే తప్పించుకుని బయటపడ్డానని, డ్రైవర్ దాడిలో తనకు స్పల్ప గాయాలయ్యాయని ఆమె వివరించారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి చర్చకు దారితీసింది. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఢిల్లీకి చెందిన భారతి చతుర్వేది ఎక్స్ లో పెట్టిన పోస్టు ప్రకారం.. ఆస్తమాతో బాధపడుతున్న తాను డాక్టర్ కన్సల్టేషన్ కోసం బుధవారం మధ్యాహ్నం ఉబెర్ కారు బుక్ చేసుకున్నానని తెలిపారు. వసంత్ విహార్ లోని తన ఇంటి నుంచి సౌత్ ఢిల్లీలోని సర్వోదయ ఎన్‌క్లైవ్ కు ప్రయాణించానని చెప్పారు.
తాను బుక్ చేసిన ప్రకారం డ్రాప్ లొకేషన్ వద్ద దింపాల్సిన డ్రైవర్.. లొకేషన్ కు దూరంగా కారును ఆపేశాడని ఆరోపించారు. ఇదేమని అడిగితే తనపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపై కారును ఆపకుండా వేగంగా తీసుకెళ్లడంతో తాను డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా.. ఓ చేతితో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చేతితో తనపై దాడి చేశాడని ఆరోపించారు.
తన చేతిని మెలిపెట్టడంతో గట్టిగా అరిచానని, దీంతో డ్రైవర్ కారును ఆపేశాడని చెప్పారు. వెంటనే కారులో నుంచి బయటపడ్డానని, పేమెంట్ చేసేందుకు ప్రయత్నించినా డ్రైవర్ తీసుకోలేదని తెలిపారు. ఆపై ఆటోలో డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకున్నాక పోలీసులకు, ఉబెర్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశానని భారతి చెప్పారు. అయితే, వారి నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని భారతి చతుర్వేది ఆరోపించారు. ఈ ఘటనతో ఢిల్లీలో ఉబెర్ బుకింగ్ చేసుకునే మహిళలు తమ రక్షణ గురించి మరోమారు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు.