కర్ణాటక పంచాయితీపై రాహుల్ గాంధీ ఫోకస్.. అందరినీ పిలిచి మాట్లాడతామన్న ఖర్గే

  • కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పోరుపై ఖర్గే స్పందన
  • సీనియర్ నేతలతో త్వరలో కీలక సమావేశం
  • హాజరుకానున్న రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్
  • అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయమని వెల్లడి
ర్ణాటక కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అధికార పోరుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టి సారించారు. అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ నేతలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు. అందరితో చర్చించకుండా, ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కీలక సమావేశానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరవుతారని ఖర్గే తెలిపారు. తాను అందరినీ చర్చలకు పిలుస్తున్నానని, ఆ సమావేశంలో రాహుల్‌ గాంధీ కూడా పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారని వివరించారు. అందరితో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మీడియాకు తెలిపారు. పార్టీలో హైకమాండ్ పాత్రపై ఖర్గే మాట్లాడుతూ.. హైకమాండ్ అంటే ఒక వ్యక్తి కాదని, అదొక బృందమని పేర్కొన్నారు. హైకమాండ్ బృందం అంతా కలిసి కూర్చుని తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.


More Telugu News