Google Meet: మొరాయించిన గూగుల్ మీట్.. వేలాది యూజర్లకు అవస్థలు

Google Meet Faces Outage Thousands of Users Affected
  • దేశవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ మీట్ సేవలు
  • మీటింగ్‌లలో చేరలేక వేలాది మంది యూజర్ల ఇబ్బందులు
  • 502 ఎర్రర్, సర్వర్ కనెక్షన్ సమస్యలతో అవస్థలు
  • సమస్య ఉన్నట్లు అంగీకరించిన గూగుల్
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం గూగుల్ మీట్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు ఆన్‌లైన్ సమావేశాల్లో చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాగిన్ సమస్యలతో పాటు, చాలామందికి "502 ఎర్రర్" అనే సందేశం కనిపిస్తుండటంతో గందరగోళం నెలకొంది.

ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'డౌన్‌డిటెక్టర్' నివేదిక ప్రకారం, సుమారు 65 శాతం మంది యూజర్లు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నారు. మరో 33 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ సమస్య ప్రధానంగా భారత్‌లోని వినియోగదారులపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ఇతర దేశాల నుంచి కూడా కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ అంతరాయంపై గూగుల్ స్పందించింది. తమ సర్వీసుల్లో సమస్య తలెత్తినట్లు కంపెనీ స్టేటస్ డ్యాష్‌బోర్డులో నిర్ధారించింది. అయితే, సమస్యకు గల కారణాలు, పరిష్కారానికి పట్టే సమయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ సాంకేతిక లోపం కారణంగా ఆఫీస్ మీటింగ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, ఇతర వర్చువల్ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో చాలామంది ఇతర ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌ల వైపు చూడాల్సి వచ్చింది.
Google Meet
Google Meet down
video conferencing
online meetings
502 error
Downdetector
Google services outage
technical issues
online classes
virtual meetings

More Telugu News