Buddha Venkanna: నోటి దూల మళ్లీ మొదలైంది.. సజ్జల జైలుకు వెళ్లడం ఖాయం: బుద్దా వెంకన్న

Buddha Venkanna Slams Sajjala Ramakrishna Reddy Predicts Jail Time
  • వైసీపీ నేత సజ్జలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్
  • వైసీపీలో సజ్జల ఓ శకుని, శూర్పణఖ అంటూ ఘాటు విమర్శలు
  • చంద్రబాబుపై కేసులున్నాయనడంపై తీవ్ర ఆగ్రహం
  • 11 సీట్లతో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని వ్యాఖ్య
వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సజ్జల మళ్లీ నోటి దూల మొదలుపెట్టారని, వైసీపీలో ఆయనొక శకుని, శూర్పణఖ లాంటి వారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసులున్నాయంటూ సజ్జల మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో విచారణలు చేసినా చంద్రబాబుపై ఎలాంటి తప్పులు నిరూపించలేకపోయారని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. జగన్ అన్యాయంగా కేసులు పెడితే ప్రజలే చంద్రబాబుకు అండగా నిలిచారన్నారు. అందుకే ఎన్నికల్లో 151 సీట్ల నుంచి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న సజ్జల, గత ఐదేళ్లలో గంజాయి సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు.

"వైసీపీ నాశనానికి సజ్జల మూల కారణమని మీ పార్టీ నేతలే చెబుతున్నారు. మద్యం ద్వారా పేదల ప్రాణాలు తీసి కోట్లు దోచుకున్నారు కాబట్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. త్వరలోనే నీ పాత్ర బయటకొస్తుంది, నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం" అని బుద్దా వెంకన్న హెచ్చరించారు. వల్లభనేని వంశీ, జోగి రమేశ్‌ల వెనుక సూత్రధారి సజ్జలనే అని... సజ్జల తప్పకుండా జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. మీ గురించి విజయసాయిరెడ్డి మొత్తం చెప్పేశారని అన్నారు.

"ర్యాలీలకు, విదేశీ పర్యటనలకు వెళ్లే జగన్‌కు కోర్టుకు వెళ్లాలంటే అనారోగ్యం గుర్తుకొస్తుంది. చంద్రబాబును అన్యాయంగా టచ్ చేస్తేనే మీ పార్టీ అడ్రస్ గల్లంతైంది. మళ్లీ టచ్ చేసే దమ్ము, ధైర్యం మీకెక్కడివి? మీడియా ఉందని ఇష్టమొచ్చినట్లు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదు" అని బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Buddha Venkanna
Sajjala Ramakrishna Reddy
TDP
YCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Corruption Allegations
Vijayawada
Vallabhaneni Vamsi

More Telugu News