హెచ్‌పీలో భారీ లేఆఫ్‌లు.. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
- ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌పీలో భారీ లేఆఫ్‌లు
- రాబోయే మూడేళ్లలో 6 వేల మంది ఉద్యోగుల తొలగింపు
- మొత్తం సిబ్బందిలో ఇది 10 శాతానికి సమానం
- కృత్రిమ మేధ వినియోగం పెంచడమే లక్ష్యమన్న సంస్థ
- ప్రకటనతో కుదేలైన హెచ్‌పీ షేర్లు
2028 ఆర్థిక సంవత్సరం నాటికి తమ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల సంఖ్యను 4,000 నుంచి 6,000 వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌పీ తెలిపింది. ఈ కోతలు సంస్థ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతానికి సమానం. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు, ఉత్పత్తుల అభివృద్ధిలో కృత్రిమ మేధ వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వివరించింది.
గతేడాది ఆర్థిక అనిశ్చితి కారణాలతో వేలాది మందిని తొలగించిన టెక్ కంపెనీలు, ఇప్పుడు ఏఐని అందిపుచ్చుకునే క్రమంలో మళ్లీ ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌పీ లేఆఫ్‌ల ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. ఈ పరిణామం టెక్ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని మరింత పెంచుతోంది.