Siddaramaiah: కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. తేల్చేయాలంటూ అధిష్ఠానానికి సిద్ధరామయ్య సూచన

Siddaramaiah Asks High Command to Decide on CM Post
  • కర్ణాటకలో ఆగని ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ
  • రాష్ట్ర కాంగ్రెస్ గందరగోళంలో ఉందన్న కుమారస్వామి
  • ఇలాంటి ప్రచారానికి ముగింపు పలకాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోమారు స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. అధికారంలోకి వచ్చాక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, సిద్ధరామయ్య, డీ.కే. శివకుమార్ చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఈ క్రమంలో రెండవ దఫా సీఎంగా ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్‌కు అవకాశం ఉంటుందనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది.

పార్టీ పెద్దలు, సిద్ధరామయ్య, ఆయన వర్గం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నప్పటికీ, ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ అంశంపై మరోసారి స్పందించారు. ఇటువంటి ప్రచారానికి ముగింపు పలికేలా పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

సిద్ధరామయ్య ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డీ.కే. శివకుమార్ చెబుతున్నప్పటికీ, ఆయన వర్గం ఎమ్మెల్యేల తీరు మాత్రం మరో విధంగా ఉంది. ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తీవ్ర గందరగోళంలో ఉందని ఆయన అన్నారు. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కుమారస్వామి వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.
Siddaramaiah
Karnataka Chief Minister
DK Shivakumar
Karnataka Politics
Congress Party

More Telugu News