Smriti Mandhana: మంధాన, పలాశ్ ల వివాహం వాయిదాపై పలాశ్ సోదరి ఏమన్నారంటే..!

Smriti Mandhana and Palash Muchhal Wedding Postponed Sister Explains
  • మంధాన తండ్రికి అనారోగ్యం వల్ల ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడిందని వెల్లడి
  • ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలంటూ విజ్ఞప్తి
  • ఇన్ స్టాలో పలక్ ముచ్చల్ వివరణ
ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. మెహందీ, హల్దీ, సంగీత్ సహా వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం, తీరా వివాహం మాత్రం ఆగిపోవడంపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. స్మృతి తన సోషల్ మీడియా ఖాతాలలో నుంచి వివాహానికి సంబంధించిన ఫొటోలను తొలగించడం ఈ రూమర్లకు తావిచ్చింది.

ఈ నేపథ్యంలో పలాశ్ ముచ్చల్ సోదరి, సింగర్ పలక్ ముచ్చల్ తన ఇన్ స్టా వేదికగా వివరణ ఇచ్చారు. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురవడంతో ప్రస్తుతానికి స్మృతి, పలాశ్ ల వివాహం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ సున్నితమైన పరిస్థితిలో ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు.

స్మృతి, పలాశ్ ల వివాహ వేడుకల్లో శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలతో ఇబ్బంది పడడంతో ఆయనను సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్మృతి మంధాన తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ ప్రకటించారు. ఆదివారం రాత్రి పలాశ్‌ ముచ్చల్‌ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ వల్ల అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పలాశ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు సమాచారం.
Smriti Mandhana
Palash Muchhal
Smriti Mandhana wedding
Palash Muchhal wedding
Srinivas Mandhana health
Palak Muchhal
Indian cricketer
Music director
Wedding postponed
Smriti Mandhana father

More Telugu News