చెల్లింపుల విషయంలో ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
- ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- జాప్యం జరిగితే అధికారులదే బాధ్యత అని వెల్లడి
- తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనాలని మిల్లర్లకు సూచన
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం జరిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
ఖరీఫ్ ధాన్యం సేకరణపై రాజమండ్రి కలెక్టరేట్‌లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వర్షాల వల్ల రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు అవసరమైన కూలీలను ముందస్తుగానే సిద్ధం చేశామన్నారు. తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రైతుల ఖాతాల్లో నగదు సకాలంలో జమ అయ్యేలా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఆయన భరోసా ఇచ్చారు.