ఏపీ మంత్రి టీజీ భరత్ ఔదార్యం.. వర్సిటీకి కోటి రూపాయల సాయం
- కర్నూలు ఉర్దూ యూనివర్సిటీకి మంత్రి టీజీ భరత్ విరాళం
- అసంపూర్తి భవనాల నిర్మాణానికి నిధుల వినియోగం
- మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వర్సిటీ వీసీ షావలిఖాన్
ఈ నిధులను ఓర్వకల్లు సమీపంలో అసంపూర్తిగా ఉన్న యూనివర్సిటీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వినియోగిస్తామని వీసీ ప్రొఫెసర్ షావలిఖాన్ తెలిపారు. యూనివర్సిటీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందజేసిన మంత్రి భరత్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యారంగ అభివృద్ధికి మంత్రి అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు.
మంత్రిని కలిసిన వారిలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ లోకనాథ, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సూరీ మన్సూర్ అలీఖాన్, డీఎండబ్ల్యూవో సబిహా పర్వీన్ తదితరులు ఉన్నారు.