గుడ్ బ్యాడ్ అగ్లీ' కాంబో రిపీట్.. అజిత్‌తో మరో సినిమా కన్ఫర్మ్!
- గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్‌తో మరో సినిమా
- ధృవీకరించిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్
- ఫిబ్రవరి చివరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడి
- ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయన్న రవిచంద్రన్
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అజిత్‌తో చేయబోయే తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. "ప్రస్తుతం లొకేషన్ల ఎంపిక జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది," అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.