జగన్, నీ పాత ట్రిక్కులు జనం కనిపెట్టారు... ఇప్పుడైనా నిజాయతీగా ఉండయ్యా: సోమిరెడ్డి
- వైఎస్ జగన్ తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు
- ఎన్నికల ముందు నాటి పాత వ్యూహాలనే జగన్ అనుసరిస్తున్నారంటూ విమర్శలు
- డ్రోన్ కెమెరాలతో జనాన్ని చూపి భ్రమలు కల్పిస్తున్నారని ఆరోపణ
- ఇకనైనా నిజాయతీగా ఉండాలంటూ జగన్‌కు హితవు
టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసినా జగన్ తన తీరు మార్చుకోలేదని, ఇప్పటికీ కాలం చెల్లిన రాజకీయ వ్యూహాలతోనే ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
"2024 ఎన్నికల ముందు కూడా ‘సిద్ధం సిద్ధం’ అని జగన్ ఇలాగే ఫోటోలు, వీడియోలు పెట్టి ఒకటే హడావుడి చేశాడు. లక్షల మంది జనం అన్నాడు... వై నాట్ 175 అన్నాడు... జరిగింది ఏంటో జనమంతా చూశారు. ఏపీ ప్రజలు సాధారణ ఎన్నికల్లో పూర్తి ఆలోచనతో, అప్రమత్తతో, అవగాహనతో, చైతన్యంతో వ్యవహరించి ఓట్లేశారు.
అయినా జగన్ మారలేదు. ఇంకా భ్రమల్లో ఉండి అవుట్ డేటెడ్ పాలిటిక్సే చేస్తున్నాడు. ఎన్నికల ముందు వాడి పడేసిన పాత ఎత్తుగడలు అమలు చేసి ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు. కోర్టుకు, పెళ్లికి, చావుకు వెళితే కూడా జనం వచ్చారని చెప్పుకుంటూ తనపై ప్రజా వ్యతిరేకత తగ్గిందని డబ్బా కొట్టుకునేందుకు కిందా మీదా పడుతున్నాడు. ఇవన్నీ ఇప్పటికే వాడేసిన అవుట్ డేటెడ్ స్ట్రాటజీస్ అని జనం గుర్తించారు. ఇప్పుడు జగన్ గుర్తించాలి.
సో... నేను చెప్పొచ్చేది ఏంటంటే... సొంత మీడియా ఎలివేషన్లు, డ్రోన్ కెమేరా ట్రిక్కులు, సోషల్ మీడియా విజువల్ ఎఫెక్ట్ లు ఇకనైనా వదిలేసి... కాస్త నిజాయతీగా ( నీవల్ల కాదనుకో) ఉండడానికి ప్రయత్నిస్తే బెటర్" అంటూ సోమిరెడ్డి హితవు పలికాడు.