Lakshmi Mittal: 226 ఏళ్ల పన్ను విధానం రద్దు.. బ్రిటన్‌ను వీడనున్న స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్!

Lakshmi Mittal Leaving UK After 226 Year Tax Rule Change
  • కొత్త పన్ను విధానంతో బ్రిటన్‌ను వీడనున్న లక్ష్మీ మిట్టల్
  • 226 ఏళ్లుగా అమల్లో ఉన్న నాన్-డోమ్ పన్ను విధానం రద్దు
  • యూకే నుంచి దుబాయ్ వైపు పెట్టుబడులు మళ్లించే యోచన
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ బ్రిటన్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పన్ను విధానం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం యూకేలోని సంపన్నులలో చర్చనీయాంశంగా మారింది.

యూకేలో 226 ఏళ్లుగా అమల్లో ఉన్న ‘నాన్-డోమ్’ (నాన్-డొమిసైల్) పన్ను విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం, యూకే నివాసితులు తమ విదేశీ ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వెసులుబాటును తొలగించడంతో మిట్టల్ వంటి ఎందరో సంపన్నులు యూకేను వీడి, పన్నుల స్వర్గధామాలైన ఇతర దేశాల వైపు చూస్తున్నారు.

ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అయిన ఆర్సెలార్ మిట్టల్‌లో మిట్టల్ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ (2025) ప్రకారం, మిట్టల్ సంపద 15.4 బిలియన్ పౌండ్లతో యూకేలో ఎనిమిదో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ఆయన కుమారుడు, కంపెనీ సీఈఓ ఆదిత్య మిట్టల్ భవిష్యత్ పెట్టుబడుల కోసం దుబాయ్ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. సంపన్నులు ఇలా దేశాన్ని వీడటం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Lakshmi Mittal
ArcelorMittal
UK tax policy
Non-Dom tax
Steel industry
கீர் ஸ்டார்மர்
Aditya Mittal
British economy
Tax haven
UK rich list

More Telugu News