ట్రాయ్ ఆదేశాలతో జియో ముందడుగు.. చౌక రీఛార్జ్ ప్లాన్లు వచ్చేశాయ్!
- కేవలం కాలింగ్ కోసం రెండు కొత్త ప్లాన్లు
- రూ.458, రూ.1958తో జియో కొత్త వాయిస్ ప్లాన్లు
- రూ.1958తో ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ
ప్లాన్ల వివరాలు
రూ.458 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని కింద దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు 1000 ఎస్ఎంఎస్‌లు, జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి మొబైల్ డేటా లభించదు.
రూ.1958 ప్లాన్: దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం పొందవచ్చు. జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.
ఈ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టిన జియో, తన పాత ప్లాన్ల జాబితా నుంచి రెండు ప్లాన్లను తొలగించింది. రూ.479 (6జీబీ డేటా, 84 రోజులు), రూ.1899 (24జీబీ డేటా, 336 రోజులు) ప్లాన్లు ఇప్పుడు యూజర్లకు అందుబాటులో లేవు.