Bangladesh A vs Pakistan A: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. సూపర్ ఓవర్‌లో బంగ్లాపై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ
- సూపర్ ఓవర్‌కు దారితీసిన ఉత్కంఠభరిత ఫైనల్
- బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న పాక్
- ఈ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది మూడో టైటిల్
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టైటిల్‌ను పాకిస్థాన్-ఏ కైవసం చేసుకుంది. దోహా వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్-ఏ జట్టుపై సూపర్ ఓవర్‌లో అద్భుత విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పాకిస్థాన్ విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్-ఏ.. పాకిస్థాన్‌ను 125 పరుగులకే ఆలౌట్ చేసింది. బంగ్లా బౌలర్ రిపోన్ మండల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ గట్టిగా పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 125 పరుగులు చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.
సూపర్ ఓవర్‌లో పాక్ బౌలర్ అహ్మద్ డానియల్ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్‌ను 2 వికెట్ల నష్టానికి కేవలం 6 పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం 7 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్-ఏ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాకిస్థాన్-ఏ ఈ టోర్నీ చరిత్రలో మూడోసారి టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది.