Palnadu Veerula Tirunalla: పల్నాటి వీరుల తిరునాళ్లలో అపశ్రుతి

Palnadu Veerula Tirunalla Tragedy Electrocution at Naguleru River
  • పల్నాడు జిల్లా కారంపూడిలో విషాద ఘటన
  • నాగులేరులో విద్యుదాఘాతానికి గురై ఒకరి మృతి
  • మరొకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
పల్నాడు జిల్లా కారంపూడిలో చారిత్రక పల్నాటి వీరుల తిరునాళ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా నాగులేరులో పుణ్యస్నానానికి దిగిన వారిలో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో ఉత్సవాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
వివరాల్లోకి వెళితే.. ఏటా వైభవంగా జరిగే పల్నాటి వీరుల తిరునాళ్ల చివరి రోజైన ఆదివారం ఈ దుర్ఘటన సంభవించింది. ఉత్సవాల్లో భాగంగా ఆచారవంతులు పవిత్రంగా భావించే కొణతాల(ఆయుధాల)కు స్నానం చేయించేందుకు సమీపంలోని నాగులేరులోకి దిగారు. అయితే, అప్పటికే ఓ విద్యుత్ తీగ తెగి నీటిలో పడి ఉంది. ఈ విషయాన్ని గమనించని వారు నీటిలోకి ప్రవేశించగానే విద్యుదాఘాతానికి గురయ్యారు.
 
ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తికి స్థానికులు వెంటనే సీపీఆర్ చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఉత్సవాల్లో ఇలాంటి దుర్ఘటన జరగడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
Palnadu Veerula Tirunalla
Palnadu
Karampudi
Naguleru River
Andhra Pradesh
Electrocution Accident
Festival Tragedy
Religious Ritual
Narasaraopet

More Telugu News