Nara Lokesh: పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Attends Sathya Sai Centenary Celebrations in Puttaparthi
  • పుట్టపర్తి వేడుకల్లో ఉపరాష్ట్రపతి, తెలుగు సీఎంలతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేశ్
  • వేడుకలకు ముందు బాబా మహాసమాధికి నివాళులు అర్పించిన మంత్రి
  • హిల్ వ్యూ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన ఉత్సవాలు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

కార్యక్రమానికి హాజరయ్యే ముందు మంత్రి లోకేశ్ ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరానికి చేరుకుని, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిరం నుంచి స్వర్ణరథంపై సత్యసాయి ప్రతిమను వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ, ఉత్తరాఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ గుహనాథన్ నరేందర్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, గ్లోబల్ కౌన్సిల్ ఛైర్మన్ కె.చక్రవర్తి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Nara Lokesh
Sathya Sai Baba
Puttaparthi
Sathya Sai Centenary Celebrations
Chandrababu Naidu
Revanth Reddy
Sri Sathya Sai Central Trust
Andhra Pradesh
Telangana
IT Minister

More Telugu News