ఆగింది ఐబొమ్మే.. పైరసీ కాదు
- శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ మూవీ రూల్జ్లో ప్రత్యక్షం
- థియేటర్ లో రికార్డు చేసి పైరసీ సైట్ లో అప్ లోడ్
- ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి సహా ఇతర సినిమాలు కూడా..
థియేటర్లలో వీడియో కెమెరాతో రికార్డు చేసి ఈ సైట్ లో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సినిమాలు అల్లరి హీరోగా వచ్చిన 12ఏ రైల్వే కాలనీతో పాటు సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే సినిమాలు మూవీరూల్జ్ సైట్ లో కనిపిస్తున్నాయి. విడుదలైన ఒక్కరోజులోనే సినిమాలు పైరసీ సైట్ లో ప్రత్యక్షం కావడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.