India vs South Africa: తేలిపోయిన‌ భారత బౌలర్లు.. భారీ స్కోరు దిశ‌గా దక్షిణాఫ్రికా

Senuran Muthusamy nears century as South Africa scores big against India
  • తొలి సెషన్‌లో వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు
  • 236 బంతుల తర్వాత వికెట్ పడగొట్టిన రవీంద్ర జడేజా
  • హాఫ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో వెర్రెయిన్ ఔట్
  • సెంచరీకి చేరువలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ముత్తుసామి
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు భారత బౌలర్లు తేలిపోయారు. స‌ఫారీ జ‌ట్టు వికెట్ కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. దాంతో ఏకంగా 236 బంతుల తర్వాత టీమిండియాకు రెండో రోజు తొలి వికెట్ లభించింది. రెండో సెషన్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా కీలకమైన వికెట్ పడగొట్టి జట్టుకు ఊరటనిచ్చాడు.

రెండో రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో కెప్టెన్ రిషభ్ పంత్ సేన తీవ్ర నిరాశకు గురైంది. అయితే, లంచ్ విరామం తర్వాత బౌలింగ్‌కు వచ్చిన జడేజా తన అద్భుత‌మైన బంతితో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో హాఫ్ సెంచరీకి కేవలం 5 పరుగుల దూరంలో వెర్రెయిన్‌ (45) పెవిలియన్ చేరాడు. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికా 131 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. క్రీజులో సెనూరన్ ముత్తుసామి (84), మార్కో యాన్సెన్ (47) ఉన్నారు. అద్భుతంగా ఆడుతున్న ముత్తుసామి తన తొలి టెస్ట్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
India vs South Africa
Senuran Muthusamy
South Africa tour of India
Centurion Test
Marco Jansen
Kyal Verreynne
Ravindra Jadeja
Rishabh Pant
Cricket

More Telugu News