Tejas Jet Crash: కుటుంబమంతా దేశసేవలోనే.. విషాదంలో తేజస్ పైలట్ నమాన్ష్ కుటుంబం

Namansh Syals Family Dedicated to Serving India
  • నమాన్ష్ భార్య అఫ్షాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్
  • తండ్రి ఆర్మీలో సేవలందించి పదవీ విరమణ
  • స్వగ్రామం హిమాచల్ ప్రదేశ్ లోని పతియాల్కర్ లో అంత్యక్రియలు
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన పైలట్ నమాన్ష్ శ్యాల్ దుర్మరణం పాలయ్యారు. ఆకాశంలో విన్యాసాలు చేస్తూ అకస్మాత్తుగా జెట్ కుప్పకూలడంతో ఆయనకు బయటపడే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నమాన్ష్ కుటుంబం మొత్తం దేశ సేవలో నిమగ్నమై ఉంది. ఆయన తండ్రి జగన్నాథ్ శ్యాల్ సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశారు.

తల్లి వీణ గృహిణి కాగా, నమాన్ష్ భార్య అఫ్షాన్ కూడా ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. నమాన్ష్ దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన చేస్తున్న సమయంలో అఫ్షాన్ కోల్ కతాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రమాద వార్త తెలిసి హుటాహుటిన కోయంబత్తూరులోని అత్తామామల వద్దకు చేరుకున్నారు. నమాన్ష్, అఫ్షాన్ దంపతులకు ఆర్య (7) అనే కుమార్తె ఉంది. కాగా, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా పతియాల్కర్ గ్రామంలో నమాన్ష్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తవుతాయని ఆయన బంధువులు తెలిపారు.
Tejas Jet Crash
Dubai Airshow
Namansh Syal
Indian Air Force
Pilot Death
Afshan Syal
Himachal Pradesh
Air Force Officer
Arya Syal

More Telugu News