Smriti Mandhana: సిగ్గరి అనుకుంటే పొరపాటే.. పెళ్లి వేడుకలో స్మృతి మంధాన అదిరిపోయే డ్యాన్స్.. ఇదిగో వీడియో!

Smriti Mandhana amazing dance at wedding celebrations video
  • టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం
  • మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్‌ ముచ్చల్‌తో నేడు ఏడడుగులు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలు
  • సంగీత్‌లో అదిరిపోయే డ్యాన్స్‌తో ఆకట్టుకున్న జంట
  • వధూవరుల మధ్య సరదాగా సాగిన క్రికెట్ మ్యాచ్
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరకాల మిత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ను ఆమె నేడు పెళ్లి చేసుకోనున్నారు. కొద్ది రోజులుగా వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా స్మృతి, పలాశ్‌ల సంగీత్ వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వధూవరులిద్దరూ ఎంతో చక్కగా కొరియోగ్రఫీ చేసిన ఓ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అంతేకాదు వరుడు పలాశ్ ప్రేమగా తలవంచగా, స్మృతి ఆయన మెడలో పూలమాల వేస్తున్న దృశ్యం అభిమానులను ముగ్ధులను చేస్తోంది. సాధారణంగా చాలా రిజర్వ్‌గా, సిగ్గరిగా కనిపించే స్మృతి.. ఇలా డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉత్సాహంగా స్టెప్పులేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడంతో పాటు వధూవరుల జట్ల మధ్య ఓ సరదా క్రికెట్ మ్యాచ్ కూడా ఆడారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన క్రికెటర్ కొత్త జీవితం ప్రారంభించబోతుండటంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Smriti Mandhana
Palash Muchhal
Smriti Mandhana wedding
Indian women's cricket
Cricket wedding
Celebrity wedding
Wedding dance video
Pre wedding celebrations
Haldi function
Cricket match

More Telugu News