Allagadda road accident: ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీల మధ్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇద్దరు మృతి

Allagadda Road Accident Two Dead in Bus Lorry Collision
  • ముందున్న లారీని ఢీకొట్టి ఆగిన బస్సు.. వెనుక నుంచి మరో లారీ ఢీ
  • మరో పది మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
  • క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక రెండు లారీల మధ్య ఓ ప్రైవేటు బస్సు చిక్కుకుపోవడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైత్రి ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాదు నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లెమెట్ట వద్దకు రాగానే, అదుపుతప్పిన బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ.. నిలిచిపోయిన బస్సును బలంగా ఢీకొట్టింది.
 
 ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు బస్సులోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే మూడు 108 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన పది మందిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
 ప్రమాదంలో లారీ డ్రైవర్‌ కూడా వాహనంలో చిక్కుకుపోగా, పోలీసులు అతి కష్టం మీద అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిన వారిలో అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఖాదర్‌వలి, ఆయన భార్య ఆసిఫా, వైఎస్‌ఆర్ కడప జిల్లా మిడ్తూరుకు చెందిన దొరస్వామి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Allagadda road accident
Kurnool district
private bus accident
Andhra Pradesh accident
Maitri Travels
road accident
lorry accident
fatal accident
accident news
Kadapa district

More Telugu News