‘వారణాసి’పై కీరవాణి కీలక అప్‌డేట్
- ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని వెల్లడి
- హనుమంతుడి పాత్రలో ఆర్. మాధవన్ నటిస్తున్నట్లు ప్రచారం
- 2027 వేసవిలో సినిమా విడుదల
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో కీలకమైన హనుమంతుడి పాత్రను ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మహేశ్ తండ్రి పాత్రలో మాధవన్ కనిపిస్తారని వార్తలు వచ్చినా, ఇప్పుడు హనుమంతుడి పాత్రలో నటించనున్నారనే ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదల చేసిన నాలుగు నిమిషాల గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. పురాణాలు, సైన్స్ ఫిక్షన్‌ను కలగలిపి రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ముఖ్యంగా త్రిశూలంతో మహేశ్ బాబు కనిపించిన తీరుకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, "రాముడి వేషంలో మహేశ్ సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు నాకే గూస్‌బంప్స్ వచ్చాయి" అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా కనిపించనుండగా, మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.