Heart attack car crash: కారు డ్రైవర్ కు గుండెపోటు.. ప్లైఓవర్ పై కారు బీభత్సం.. వీడియో ఇదిగో!

Thane Car Crash Driver Dies of Heart Attack on Flyover
  • ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన కారు
  • ప్లైఓవర్ పైనుంచి ఎగిరి కిందపడ్డ బైకర్
  • అక్కడికక్కడే నలుగురి దుర్మరణం
  • మహారాష్ట్ర థానే జిల్లాలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై ఘటన
ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళుతుండగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు.. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది. వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వాహనదారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఠాణె జిల్లా అంబర్ నాథ్ ప్లైఓవర్ పై శుక్రవారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. శివసేన పార్టీ నేత కిరణ్‌ చాబే కారులో వెళుతుండగా డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యాడు. అంబర్ నాథ్ ప్లైఓవర్ పైకి ఎక్కిన తర్వాత కారు అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న బైక్‌లు, ఇతర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్‌ కింద పడ్డాడు. కారు డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు వాహనదారులు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ చాబె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Heart attack car crash
Ambernath flyover accident
Maharashtra road accident
Lakshman Shinde
Thane accident
Road accident India
Kiran Chabe
Shiv Sena leader

More Telugu News