తిరుమల ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలు.. తీవ్ర వివాదం
- ఇటీవల భర్త, స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన శివజ్యోతి
- క్యూ లైన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకరమ్మ
- రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వ్యాఖ్యలు
వివరాల్లోకి వెళితే, ఇటీవల శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉండగా, టీటీడీ సేవకులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆ సమయంలో ప్రసాదాన్ని అందుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు "తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం... రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే" అంటూ వ్యాఖ్యానించారు.
పైగా ఇదేదో గొప్ప పని అయినట్టు... ఈ సంభాషణను వీడియో తీసి, తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పవిత్రమైన ప్రసాదాన్ని అగౌరవపరిచిన శివజ్యోతి, ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.