ఆ లుక్ నాకు స్ఫూర్తినిచ్చింది: బాలకృష్ణ
- 'వీరసింహారెడ్డి'లో తన గెటప్ కాపీయేనన్న బాలకృష్ణ
- 'మఫ్టీ'లోని శివ రాజ్‌కుమార్ లుక్ తనకు స్ఫూర్తినిచ్చిందని వెల్లడి
- చిక్కబళ్లాపురలో ఘనంగా 'అఖండ 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా హాజరైన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్
- డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో 'అఖండ 2' విడుదల
బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ‘అఖండ 2 తాండవం’ పేరుతో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ‘అఖండ 2’ ఒక పాన్ ఇండియా చిత్రం. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన తొలి భారతీయ సినిమా ‘అఖండ’. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సనాతన హైందవ ధర్మం ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ మల్హోత్రా అద్భుతంగా నటించారు’’ అని అన్నారు. అనంతరం శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, బాలకృష్ణ తనకు సోదరుడిలాంటి వారని పేర్కొన్నారు.