Smriti Mandhana: ఘనంగా స్మృతి మంధాన హల్దీ వేడుక.. డ్యాన్సులతో అదరగొట్టిన మహిళా క్రికెటర్లు

Smriti Mandhana Haldi Ceremony Celebrations with Teammates
  • టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వివాహం
  • సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌తో రేపు పెళ్లి
  • సహచర క్రికెటర్లతో కలిసి ఘనంగా జరిగిన హల్దీ వేడుక
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోలు
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్మృతి హల్దీ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహచర క్రికెటర్లు హాజరై సందడి చేశారు.

పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయిన జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, రాధా యాదవ్ వంటి క్రీడాకారిణులు.. వధువు స్మృతితో కలిసి డ్యాన్సులు చేశారు. పెళ్లి పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్ షఫాలీ వర్మ.. స్మృతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను "లడ్కీ వాలే" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.

కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి-పలాశ్‌ జంట.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే పలాశ్‌ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. ఆమె వేలికి డైమండ్ రింగ్ తొడిగిన వీడియోను "ఆమె ఓకే చెప్పింది" అనే క్యాప్షన్‌తో పంచుకోగా, అది వైరల్ అయింది.

పలాశ్‌ ముచ్చల్ (30) ప్రముఖ బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ సోదరుడు. ఆయన సంగీత దర్శకుడిగా, ఫిలింమేకర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. వీరిద్దరి వివాహంతో క్రీడా, సినీ రంగాల బంధం మరింత బలపడనుంది.
Smriti Mandhana
Smriti Mandhana wedding
Palash Muchhal
Indian women cricket team
Jemimah Rodrigues
Shafali Verma
Cricket wedding
Bollywood wedding
Indian cricketer
Haldi ceremony

More Telugu News