KTR: సీఎం రేవంత్ రెడ్డికి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు: కేటీఆర్

KTR Says CM Revanth Reddy Doesnt Dare to Arrest Him
  • ఈ-కార్ రేసు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమ‌న్న కేటీఆర్‌
  • కడియంను కాపాడేందుకే దానం నాగేందర్ తో రాజీనామా చేయించే ప్రయత్నం అని ఆరోపణ
  • అనర్హత వేటు తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడ అని విమర్శలు
  • ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాతే ఉపఎన్నికలు అని జోస్యం
సీఎం రేవంత్ రెడ్డికి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ-కార్ రేసు కేసులో ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నా" అని కేటీఆర్ స్పష్టం చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని కాపాడేందుకే దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ఈ రాజీనామా డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ముందుగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాతే ఉపఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
BRS
Telangana
GHMC Elections
MLAs
Defection
Kadayam Srihari
Danam Nagender

More Telugu News