Annapurna Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు

Annapurna Rama Naidu Studios Face GHMC Notice for Tax Evasion
  • ట్రేడ్ లైసెన్స్ ఫీజులో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ
  • వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపి ఫీజులు ఎగ్గొట్టిన వైనం
  • బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారుల ఆదేశం
హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు కొరడా ఝళిపించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించి, రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. ఏళ్లుగా వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపిస్తూ, బల్దియాకు చెల్లించాల్సిన ఫీజులో కోత విధిస్తున్నట్టు అధికారులు తేల్చారు.

బల్దియా సర్కిల్-18 అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియో ఏటా రూ. 11.52 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. అదేవిధంగా, రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన రూ. 1.92 లక్షలకు బదులుగా కేవలం రూ. 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు.

ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని వాస్తవం కంటే చాలా తక్కువగా చూపడం వల్లే ఫీజులో ఇంత భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు వివరించారు. ఈ పన్ను ఎగవేతను తీవ్రంగా పరిగణించిన జీహెచ్ఎంసీ... బకాయిపడ్డ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. వాస్తవ విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలని కూడా స్పష్టం చేసింది.  
Annapurna Studios
Annapurna Studios Hyderabad
Rama Naidu Studios
Rama Naidu Studios Hyderabad
GHMC
GHMC Hyderabad
Trade License Fee
Tax Evasion
Hyderabad News
Telugu News

More Telugu News