YS Jagan: జగన్ రాక సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టులో వైసీపీ కార్యకర్తల హల్ చల్

YS Jagan Supporters Create Ruckus at Begumpet Airport
  • నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకూ భారీగా జనం
  • 2029 లో రప్ఫా రప్ఫా అంటూ నినాదాలు
  • పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు
  • అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరైన ఏపీ మాజీ సీఎం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ కు వచ్చారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద, నాంపల్లి సీబీఐ కోర్టు సమీపంలో హల్ చల్ చేశారు. వైసీపీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

‘2029లో రప్ఫా రప్ఫా’ అంటూ జగన్ అభిమానులు నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. బేగంపేట ఎయిర్ పోర్టు వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

నాంపల్లి కోర్టు సమీపంలో..
అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చిన జగన్ కోసం వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
YS Jagan
Jagan Mohan Reddy
YSRCP
Begumpet Airport
Nampally CBI Court
Illegal Assets Case
Andhra Pradesh Politics
2029 Elections
Raffa Raffa
Hyderabad

More Telugu News