తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టు

  • సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన
  • సింగరేణి భవన్ ఎదుట ఆందోళనకు దిగిన కవిత
  • కవితను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లిలో గల సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన కవితను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కవిత సింగరేణి భవన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డిపెండెంట్ ఉద్యోగులను పునరుద్ధరించాలని ఆమె అన్నారు.

సింగరేణి సమస్యలను పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వమని ఆమె విమర్శించారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కవితతో పాటు బైఠాయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సింగరేణి భవన్‌ను కవిత ముట్టడిస్తుందన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


More Telugu News