బీహార్ ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ ఖరారు

  • నితీశ్‌ను కూటమి నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
  • పాట్నాలోని గాంధీ మైదానంలో రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలు గెలిచిన ఎన్డీయే కూటమి
ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు నితీశ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన లేఖ సమర్పించనున్నారు. నితీశ్ కుమార్ రేపు పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పాట్నాలోని గాంధీ మైదానంలో ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమిలో భాగమైన బీజేపీ 89 స్థానాల్లో, జేడీయూ 85 స్థానాల్లో, ఎల్జేపీ (పాశ్వాన్) 19 స్థానాల్లో గెలుపొందాయి. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ ఈ ఎన్నికల్లో పరాజయం పాలైంది. జేడీయూ 25 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.


More Telugu News