విశాఖపట్నం సమీపంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
- పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- విద్యుత్ లైన్ పనులు జరుగుతుండగా పక్కకు ఒరిగిన స్తంభం
- పైలట్ అప్రమత్తమై రైలు నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం
- స్తంభం ఒరిగిన ఘటనలో పలువురికి గాయాలు
విశాఖపట్నం సమీపంలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే, విద్యుత్ లైన్ పనులు జరుగుతుండగా ఒక కరెంట్ పోల్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి టాటానగర్ ఎక్స్‌ప్రెస్ వస్తుండటంతో, లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగిపోవడంతో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే శాఖ వెంటనే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టింది.