రాజమౌళి, హిందువులు సినిమా చూడకపోతే నీ బతుకేమవుతుందో ఆలోచించు: చికోటి ప్రవీణ్ తీవ్ర వ్యాఖ్యలు
- నీ సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలన్న చికోటి ప్రవీణ్
- హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే ద్రోహిగా మిగిలిపోతావని హెచ్చరిక
- హిందువులు ఆగ్రహం చెందితే రాజమౌళి హీరో నుంచి జీరో అవుతారన్న చికోటి ప్రవీణ్
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "రాజమౌళీ, హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. నీ సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలి" అని తీవ్రంగా స్పందించారు. రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే హిందూ ద్రోహిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. హిందూ సమాజం ఆగ్రహిస్తే రాజమౌళి బతుకు హీరో నుంచి జీరో అవుతుందని అన్నారు.
మదమెక్కిన ఏనుగు మురికి కాలువలో పడినట్లుగా ఎస్.ఎస్. రాజమౌళి వ్యవహార శైలి ఉందని ఆయన అన్నారు. ఆయన అద్భుతమైన దర్శకుడు అనే ఉద్దేశంతో అందరూ అభిమానిస్తారని అన్నారు. కానీ ఒక్క ప్రకటనతో హిందూ సమాజంలో ఆయనపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి దేవుడిని నమ్మకుంటే తమకు వచ్చిన సమస్య ఏమీ లేదని, కానీ విమర్శించడం సరికాదని అన్నారు. మీ ప్రతి సినిమాకు ముందు దేవుడికి పూజ చేసి ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావో చెప్పాలని ప్రశ్నించారు. దేవుడి కథలతో డబ్బులు సంపాదించాడని అందరూ చెబుతున్నారని, అందులో వాస్తవం ఉందని అన్నారు.
నాస్తిక కుక్కలతోనే సినిమా తీయాలని రాజమౌళికి సూచించారు. నీ సినిమాలకు కూడా నాస్తిక కుక్కలనే అనుమతించు అని వ్యాఖ్యానించారు. అహంకారంతో విర్రవీగే భల్లాలదేవ చివరకు ఎలా పతనమయ్యాడో నీ సినిమా బాహుబలిలోనే చూపించావు... ఈరోజు నీవు అదే అహంకారంతో ప్రవర్తిస్తే నీ పతనం ఖాయం అని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.