Indian origin: ఆస్ట్రేలియాలో భారత సంతతి గర్భిణి మృతి.. వాకింగ్ చేస్తుండగా ఢీ కొట్టిన కారు

Australia Car Accident Samanvita Dhareshwar 8 Month Pregnant Woman Dies
  • తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చిన ఎమర్జెన్సీ సిబ్బంది
  • చికిత్స పొందుతూ తల్లి, కడుపులోని బిడ్డ మరణించారని వైద్యుల వెల్లడి
  • బీఎండబ్ల్యూ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు ఢీ కొట్టడంతో భారత సంతతికి చెందిన 8 నెలల గర్భిణి మరణించింది. భర్తతో కలిసి వాకింగ్ చేస్తున్న సమయంలో కారు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన సమన్విత ధరేశ్వర్ సిడ్నీలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సిస్టమ్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. భర్త, మూడేళ్ల బాబుతో పాటు సిడ్నీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. ఈ క్రమంలోనే కిందటి వారం భర్త, కొడుకుతో కలిసి సమన్విత వాకింగ్ కు వెళ్లారు. ఆ సమయంలో ఓ బీఎండబ్ల్యూ కారు అతివేగంగా దూసుకొచ్చింది.

అదుపుతప్పి పార్కింగ్ లాట్ లోని మరో కారును ఢీ కొట్టింది. దీంతో ఆ కారు కదిలి ముందున్న సమన్వితను బలంగా తాకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సమన్వితను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సమన్వితను కానీ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కానీ కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. 

కాగా, ఈ ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ డ్రైవర్ ను ఆరన్ పాపజోగ్లు (19) గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళతో పాటు ఆమె కడుపులోని బిడ్డ మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఆస్ట్రేలియాలో గర్భంలో ఉన్న బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. నిందితులకు అదనంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
Indian origin
Pregnant woman
Car accident
Samanvita Dhareshwar
Sydney
Australia
BMW
Aaron Papajoglou
Road accident

More Telugu News