Nandamuri Balakrishna: వైజాగ్‌లో 'అఖండ 2' సందడి.. 'జాజికాయ' పాట విడుదల

Nandamuri Balakrishna Akhanda 2 Jajikaya Song Released in Vizag
  • డిసెంబర్ 5న రానున్న బాలకృష్ణ అఖండ 2: తాండవం
  • జాజికాయ ఐటెం సాంగ్ కాదు, కుటుంబ వేడుకలోని పాటన్న బోయపాటి
  • సనాతన ధర్మం శక్తిని ఈ చిత్రంలో చూస్తారన్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిన్న వైజాగ్‌లో చిత్రంలోని "జాజికాయ జాజికాయ" అనే పాటను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సంయుక్తా మేనన్ నటిస్తుండగా, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "నాది, బోయపాటిది సినిమా వస్తుందంటేనే ఇంట గెలిచినట్లు. ఇప్పుడు 'అఖండ 2'తో రచ్చ గెలవడానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ‘అఖండ తాండవం’ పాటతో హిందీ ప్రేక్షకులకు మా తొలి దెబ్బ రుచి చూపించాం. ఇప్పుడు విడుదల చేసిన 'జాజికాయ' పాట ఐటెం సాంగ్ కాదు, కుటుంబ పండగలో వచ్చే గీతం," అని స్పష్టం చేశారు. "సనాతన హిందూ ధర్మం మన జాతి మూలం. ఆ ధర్మం చెప్పే శక్తిని, పరాక్రమాన్ని, గౌరవాన్ని ఈ సినిమాలో చూస్తారు," అని బాలకృష్ణ ఉద్ఘాటించారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో ఉన్న ఏకైక మాస్ పాట 'జాజికాయ'. ఇది పుట్టినరోజు వేడుక నేపథ్యంలో వస్తుంది. ఈ పాటలో బాలకృష్ణను మరో కోణంలో చూస్తారు," అని తెలిపారు. కథానాయిక సంయుక్తా మేనన్ మాట్లాడుతూ.. బాలయ్య-బోయపాటి కలయిక అనగానే మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకున్నానని, తన పాత్రలో కొన్ని సస్పెన్స్ అంశాలు ఉంటాయని అన్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 
Nandamuri Balakrishna
Akhanda 2
Boyapati Srinu
Samyuktha Menon
Vizag
Jajikaya Song
Telugu Movie
Ram Achanta
Gopi Achanta
Thaman

More Telugu News