Hema: సినీ నటి హేమ ఇంట్లో తీవ్ర విషాదం

Actress Hema Mother Kolla Lakshmi Dies
  • హేమ తల్లి కోళ్ల లక్ష్మి కన్నుమూత
  • తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మృతి
  • తల్లి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరైన హేమ
ప్రముఖ సినీ నటి హేమ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని వారి స్వగ్రామమైన రాజోలులో నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలియగానే హేమ హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

"నిన్న ఉదయం కూడా నాతో ఎంతో బాగా మాట్లాడింది. ఇంతలోనే ఇలా జరిగిపోయింది" అంటూ హేమ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. గతంలో రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో తాను అరెస్ట్ కావడం తన తల్లిని మానసికంగా కుంగదీసిందని, ఆ షాక్‌తోనే ఆమె ఆరోగ్యం క్షీణించిందని హేమ గతంలో పలు ఇంటర్వ్యూలలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన తల్లి మరణానికి ఆ ఘటనే కారణమని ఆమె భావిస్తున్నారు.
Hema
Hema actress
Kolla Lakshmi
Telugu actress Hema
Hema mother death
Razole
East Godavari district
Telugu cinema
rave party drugs case

More Telugu News