ఇండియన్ రైల్వే స్టేషన్లలో త్వరలో మెక్ డొనాల్డ్స్, కేఎఫ్ సీ రెస్టారెంట్లు
- దేశవిదేశీ రెస్టారెంట్ల ఔట్ లెట్ల ఏర్పాటుకు రైల్వే బోర్డు నిర్ణయం!
- ఈ ఆక్షన్ లో ఐదేళ్ల పాటు నిర్వహించేందుకు అనుమతి
- దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో ఏర్పాటు కానున్న సరికొత్త ఔట్ లెట్లు
ఇందులో మెక్ డొనాల్డ్స్, కేఎఫ్ సీ, బస్కిన్ అండ్ రాబిన్స్ వంటి అంతర్జాతీయ రెస్టారెంట్లతో పాటు బికనీర్ వాలా, హల్దిరామ్స్ వంటి దేశీయ బ్రాండ్లకు కూడా అవకాశం కల్పించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుకు అమలు చేస్తున్న నియమ నిబంధనలే వీటికి కూడా వర్తిస్తాయని పేర్కొన్నాయి. ఈ ఆక్షన్ పాలసీ ద్వారా సదరు రెస్టారెంట్లు నేరుగా లేదా ఫ్రాంచైజీ విధానంలో ఔట్ లెట్ ఏర్పాటుకు రైల్వే సమ్మతించనుంది. ఈ ఆక్షన్ లో ఎంపికైన రెస్టారెంట్, ఫ్రాంచైజీలకు ఆయా రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల పాటు ఔట్ లెట్ నిర్వహించేందుకు అధికారులు అనుమతించనున్నారు.