ఇండియన్ రైల్వే స్టేషన్లలో త్వరలో మెక్ డొనాల్డ్స్, కేఎఫ్ సీ రెస్టారెంట్లు

  • దేశవిదేశీ రెస్టారెంట్ల ఔట్ లెట్ల ఏర్పాటుకు రైల్వే బోర్డు నిర్ణయం!
  • ఈ ఆక్షన్ లో ఐదేళ్ల పాటు నిర్వహించేందుకు అనుమతి
  • దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో ఏర్పాటు కానున్న సరికొత్త ఔట్ లెట్లు
రైల్వే స్టేషన్లలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ల ఏర్పాటుకు రైల్వే బోర్డు ఆమోదం తెలపనుంది. ఈ దిశగా బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుందని సమాచారం. ఈ నిర్ణయం అమలులోకి వచ్చాక రైలు ప్రయాణికులు చాయ్ సమోసాలతో సరిపెట్టుకోనవసరం లేదు. బర్గర్లు, పిజ్జాలను ఎంచక్కా ఆరగించవచ్చు. ఈమేరకు ప్రీమియం బ్రాండ్ కాటరింగ్ ఔట్ లెట్ కేటగిరీలో దేశవ్యాప్తంగా 1,200 రైల్వే స్టేషన్లలో ఎంఎన్ సీ రెస్టారెంట్ ఫ్రాంచైజీల ఏర్పాటుకు రైల్వే బోర్డు అనుమతించనుంది.

ఇందులో మెక్ డొనాల్డ్స్, కేఎఫ్ సీ, బస్కిన్ అండ్ రాబిన్స్ వంటి అంతర్జాతీయ రెస్టారెంట్లతో పాటు బికనీర్ వాలా, హల్దిరామ్స్ వంటి దేశీయ బ్రాండ్లకు కూడా అవకాశం కల్పించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుకు అమలు చేస్తున్న నియమ నిబంధనలే వీటికి కూడా వర్తిస్తాయని పేర్కొన్నాయి. ఈ ఆక్షన్ పాలసీ ద్వారా సదరు రెస్టారెంట్లు నేరుగా లేదా ఫ్రాంచైజీ విధానంలో ఔట్ లెట్ ఏర్పాటుకు రైల్వే సమ్మతించనుంది. ఈ ఆక్షన్ లో ఎంపికైన రెస్టారెంట్, ఫ్రాంచైజీలకు ఆయా రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల పాటు ఔట్ లెట్ నిర్వహించేందుకు అధికారులు అనుమతించనున్నారు.


More Telugu News