తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు!

  • తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • 12 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనానికి వేచివున్న భక్తులు
  • నిన్న 71 వేల మందికి స్వామివారి దర్శనం
  • నిన్న ఒక్కరోజే రూ. 3.84 కోట్ల హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అంచనా వేస్తున్నారు.
 
నిన్న ఒక్కరోజే 71,208 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 23,135 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
 
భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


More Telugu News