గోషామహల్లో స్వల్పంగా కుంగిన ఐదంతస్తుల భవనం
- భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిల్లర్ల కోసం గుంతలు
- నిన్న రాత్రి జేసీబీతో గుంతలు తీసినట్లు తెలిపిన స్థానికులు
- పక్కనే ఉన్న భవనానికి నెర్రలు వచ్చి స్వల్పంగా కుంగినట్లు వెల్లడి
సంఘటన స్థలానికి అధికారులు, పోలీసులు చేరుకున్న భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అక్కడి నుంచి తరలించారు.
ఈ భవనం పక్కనే పిల్లర్ల కోసం జేసీబీతో గుంతలు తవ్వడంతో భవనంకు నెర్రలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భవనం పూర్తిగా కూలిపోతే పక్కన ఉన్న భవనాలపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భవనం పక్కనున్న ఖాళీ స్థలంలో రాత్రి సమయంలో జేసీబీతో తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. దీంతో ఉదయం పది గంటలకు భవనం కొద్దిగా కుంగిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ భవనం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు.