Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది

Hyderabad Pilgrims Die in Saudi Arabia Bus Accident
  • ఈరోజు తెల్లవారుజామున సౌదీలో బస్సు ప్రమాదం
  • మల్లేపల్లి బజార్‌ ఘాట్‌ లో విషాద ఛాయలు
  • ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మక్కా యాత్రకు వెళ్లారని అధికారుల వివరణ
సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని సమాచారం. మృతుల్లో 18 మంది పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు. దీంతో మల్లేపల్లి బజార్ ఘాట్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీరంతా మక్కా యాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున మక్కా నుంచి మదీనా వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయని, ప్రయాణికులు తేరుకునేలోపే వారిని మంటలు చుట్టుముట్టాయని సమాచారం. బదర్– మదీనా ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన 45 మందిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు.

మృతులు..
మల్లేపల్లి బజార్‌ ఘాట్‌కు చెందిన రహీమున్నీసా, రహమత్‌ బీ, షెహనాజ్‌ బేగం, గౌసియా బేగం, కదీర్‌ మహ్మద్, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్, సోహైల్‌ మహ్మద్, మస్తాన్‌ మహ్మద్, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, మహ్మద్‌ మంజూరు, మహ్మద్‌ అలీ. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
Saudi bus accident
old city
Hyderabad
Mecca
Medina
Mallepally Bazar Ghat
Indian Pilgrims
Road Accident
Hajj Pilgrimage
Rahmatullahi Bee
Telangana

More Telugu News