California beach: అలల్లో కొట్టుకుపోతున్న బిడ్డ కోసం తండ్రి సాహసం.. కాలిఫోర్నియాలో కెనడా పౌరుడి మృతి

Canada Citizen Yuqi Hu Dies in California Beach Rescue Attempt
  • సముద్రంలో గల్లంతైన ఐదేళ్ల బాలిక
  • కాపాడేందుకు సముద్రంలో దూకిన తండ్రి
  • బాలిక గల్లంతు.. తండ్రిని ఒడ్డుకు చేర్చిన బీచ్ లైఫ్ గార్డ్
  • ఆసుపత్రికి తరలించే లోపే తండ్రి మృత్యువాత
బీచ్ లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అలల ధాటికి కుమార్తె సముద్రంలో కొట్టుకుపోగా.. కాపాడేందుకు వెళ్లిన తండ్రి అలలకు ఎదురీదలేక ఉక్కిరిబిక్కిరయ్యాడు. బీచ్ గార్డు గమనించి ఒడ్డుకు చేర్చగా అప్పటికే స్పృహ కోల్పోయిన ఆ వ్యక్తి ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. కాలిఫోర్నియాలోని గర్రపాట స్టేట్ బీచ్ లో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనలో కెనడా పౌరుడు ప్రాణాలు కోల్పోగా, అతడి ఐదేళ్ల కుమార్తె సముద్రంలో గల్లంతైంది. వివరాల్లోకి వెళితే..

కెనడాకు చెందిన యుజి హు (39) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం కాలిఫోర్నియాలోని గర్రపాట బీచ్ కు వెళ్లారు. తీరంలో కుమార్తె (5) తో కలిసి సరదాగా ఆడుతుండగా అలలు ఆ పాపను సముద్రంలోకి లాగేశాయి. కళ్లముందే కుమార్తె అలలకు కొట్టుకుపోతుండడం చూసి హు వెంటనే తాను కూడా సముద్రంలోకి పరుగుపెట్టాడు. ఆయన భార్య కూడా పాప కోసం నీళ్లలోకి దిగింది. అలల ధాటికి హు ఉక్కిరిబిక్కిరవుతుండగా ఒడ్డున ఉన్న బీచ్ లైఫ్ గార్డ్ గమనించి కాపాడారు.

హు భార్య కూడా అతికష్టమ్మీద ఒడ్డుకు చేరింది. కానీ పాప మాత్రం సముద్రంలో గల్లంతైంది. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, అస్వస్థతకు గురైన హు ను, అతడి భార్యను ఆసుపత్రికి తరలించగా.. హు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. హు భార్యకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
California beach
Canada citizen
drowning
beach accident
child missing
Gaviota State Beach
sea rescue
family tragedy
coastal safety

More Telugu News