ఐబొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో... సజ్జనార్ తో సినీ ప్రముఖుల భేటీ

  • హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు
  • భేటీలో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు
  • సినిమా పైరసీని అరికట్టడంపై ప్రధానంగా చర్చ
సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి రిమాండ్ లో ఉన్నాడు. ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు ఉన్నారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు.


More Telugu News