Gowri: ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా పాక్ కాల్పుల్లో గాయపడిన దూడ ‘గౌరి’కి కొత్త జీవితం!

Gowri the Cow Receives Artificial Limb After Injury in Pakistan Shelling
  • మే 20న పాకిస్థాన్ సైన్యం జరిపిన షెల్లింగ్‌లో దూడ కాలికి గాయం
  • రాజస్థాన్ వైద్యుడి చొరవతో 'కృష్ణ లింబ్' అనే కృత్రిమ కాలు అమరిక
  • 'కృష్ణ లింబ్'తో దేశవ్యాప్తంగా 500కు పైగా జంతువులకు పునర్జన్మ
జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయిన ఓ దూడకు మానవత్వం అండగా నిలిచింది. రాజస్థాన్‌కు చెందిన ఓ పశువైద్యుడి చొరవతో 'కృష్ణ లింబ్' అనే కృత్రిమ కాలును అమర్చడంతో ఆ దూడ తిరిగి నడవగలుగుతోంది. ఈ ఘటన సరిహద్దు గ్రామాల్లోని మూగజీవాలకు కొత్త ఆశను కల్పిస్తోంది.

ఆర్ఎస్ పురాలోని ఫతేపూర్ సమారియా పోస్ట్ వద్ద నివసించే రాజేశ్ అనే టీ వ్యాపారికి 'గౌరి' అనే ఏడాదిన్నర వయసున్న దూడ ఉంది. ఈ ఏడాది మే 20న పాకిస్థాన్ సైన్యం జరిపిన షెల్లింగ్‌లో రాజేశ్ ఇల్లు ధ్వంసం కాగా, గౌరి కాలుకు తీవ్ర గాయమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, భారీ వర్షాల కారణంగా స్థానిక వైద్యులు చికిత్స అందించేందుకు వెనుకడుగు వేశారు.

దీంతో నిరాశ చెందిన రాజేశ్ దేశవ్యాప్తంగా అంగవైకల్యం ఉన్న జంతువులకు సేవ చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ తపేశ్ మాథుర్‌ను సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి, గౌరికి విజయవంతంగా 'కృష్ణ లింబ్'ను అమర్చారు. డాక్టర్ మాథుర్ 11 ఏళ్ల పాటు పరిశోధించి ఈ కృత్రిమ అవయవాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు దేశంలోని 22 రాష్ట్రాల్లో ఆవులు, గుర్రాలు, గేదెలు, మేకలు సహా 500కు పైగా జంతువులకు దీనిని అమర్చారు. ఆయన సేవలకు గాను పలు అవార్డులు కూడా అందుకున్నారు. 
Gowri
Operation Sindoor
cow
artificial limb
Dr Tapesh Mathur
Krishna Limb
Jammu Kashmir
Pakistan shelling
animal welfare
veterinarian

More Telugu News