రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్థ: వెంకయ్యనాయుడు
- రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
- రామోజీరావు జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల ప్రముఖులకు పురస్కారాలు
- రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తి అని కొనియాడిన వెంకయ్యనాయుడు
- తెలుగు పోతే వెలుగు లేదంటూ మాతృభాష ప్రాధాన్యాన్ని వివరించిన మాజీ ఉపరాష్ట్రపతి
- జనహితమే జర్నలిజం అని నమ్మిన మహనీయుడు రామోజీరావు అని ప్రశంస
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తిమంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభివర్ణించారు. స్వయంకృషి, క్రమశిక్షణ, పట్టుదలతో అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి, భావి తరాలకు మార్గదర్శకంగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, "రామోజీరావు లేని ఆయన సంస్థలను ఊహించుకోలేకపోతున్నాను. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి. జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించిన మహామనీషి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన ఆయన జీవితం యువతకు గొప్ప స్ఫూర్తి. ఆయన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో లబ్ధి పొందారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన స్థానం శాశ్వతం" అని పేర్కొన్నారు. ప్రజా జీవితంపై రామోజీరావు వేసినంత బలమైన ముద్ర ఇటీవలి కాలంలో మరెవరూ వేయలేదని ఆయన అన్నారు.
విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను రామోజీరావు జయంతి సందర్భంగా సత్కరించడం అభినందనీయమని వెంకయ్యనాయుడు అన్నారు. "రామోజీరావు కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన క్రాంతి దర్శి. సామాజిక నిబద్ధత అనే పునాదిపై తన విజయ సౌధాన్ని నిర్మించుకున్నారు. ఆయన పత్రికను ధర్మయుద్ధం కోసం ఉపయోగించారు. తెలుగు పోతే వెలుగు లేదు. మన మాతృభాషను కాపాడుకోవడమే మనం రామోజీరావుకు ఇచ్చే నిజమైన నివాళి" అని ఆయన ఉద్ఘాటించారు.
రామోజీరావు పత్రికారంగానికి లైట్ హౌస్ వంటివారు: జస్టిస్ ఎన్.వి. రమణ
రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం జరిగిన 'రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల-2025' ప్రదానోత్సవంలో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామోజీరావు సేవలను జస్టిస్ రమణ కొనియాడారు. "రామోజీరావు పత్రికారంగానికి ఒక 'లైట్ హౌస్' లాంటి వారు. తన పత్రికను ఆయన ఎన్నడూ స్వప్రయోజనాలకు వాడుకోలేదు. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కు వంటి ఎన్నో ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు" అని ప్రశంసించారు. దేశ నిర్మాణం కోసం పాటుపడటమే రామోజీరావుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు రాజకీయ నాయకుల వెనుక రౌడీలు ఉండేవారని, ఇప్పుడు వారి స్థానాన్ని సోషల్ మీడియా ఆక్రమించిందని జస్టిస్ ఎన్.వి.రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నిరాధారమైన దుష్ప్రచారం సమాజానికి తీవ్ర నష్టం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రచురణకర్తగా, మీడియా హౌస్‌గా మారిపోయారని, జవాబుదారీతనం లేకపోవడంతో ఫేక్ న్యూస్ పెను ప్రమాదంగా తయారైందని జస్టిస్ రమణ విశ్లేషించారు.
"ప్రజాస్వామ్యయుతంగా భావ ప్రకటనకు వేదిక కావాల్సిన సోషల్ మీడియా, ఇతరులను వేధించేందుకు, దుష్ప్రచారాలు చేసేందుకు ఒక పీడగా మారింది. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఇంకా గుర్తించకపోవడం ఆందోళనకరం. ప్రధాన స్రవంతి మీడియాను సోషల్ మీడియా కబళిస్తోంది. ఈ డిజిటల్ ప్రపంచం సైబర్ నేరగాళ్లకు, బ్లాక్‌మెయిలర్లకు స్వర్గధామంగా మారింది" అని ఆయన ఘాటుగా విమర్శించారు.
ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, రామ్ మోహన్ నాయుడు, బండి సంజయ్ తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.