Chandrababu Naidu: చంద్రబాబు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అయితే, లోకేశ్ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్': వెనిగండ్ల రాము

Chandrababu and Lokesh Efforts Visible to People Says Venigandla Ramu
  • ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో చంద్రబాబు, లోకేష్ కృషి అద్వితీయమన్న రాము
  • విశాఖ సీఐఐ సదస్సు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
  • 16 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం
  • జగన్ విధ్వంసకర విధానాలతో వెళ్లిన కంపెనీలు సైతం తిరిగి వస్తున్నాయని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషి, వ్యూహాత్మక పనితీరు అద్వితీయమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రశంసించారు. వారి అవిశ్రాంత శ్రమ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అయితే, లోకేశ్ 'మ్యాన్ ఆఫ్ యాక్షన్' అని రాము అభివర్ణించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

విశాఖపట్నంలో నిన్న ముగిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సు చారిత్రాత్మక విజయం సాధించిందని రాము కొనియాడారు. "సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పడుతున్న కష్టం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ఎందరో పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వేల మందిని సమన్వయపరిచి ఇంత పెద్ద సదస్సును విజయవంతం చేయడం అసాధారణ విషయం. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల సదస్సులో భోజనాల కోసం కొట్టుకున్న దుస్థితిని చూశాం. కానీ ఇప్పుడు, కేవలం రెండు రోజుల్లో రూ.13,25,716 కోట్ల విలువైన 613 ఒప్పందాలు కుదిరాయి. దీని ద్వారా 16,13,188 ఉద్యోగాలు రానున్నాయి. ఇది చంద్రబాబు, లోకేశ్ నాయకత్వ పటిమకు, వారి విజన్‌కు నిదర్శనం" అని ఆయన వివరించారు. 

గత జగన్ రెడ్డి ప్రభుత్వ విధ్వంసకర విధానాల కారణంగా రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన రెన్యూ, హీరో ఫ్యూచర్స్, ఏబీసీ వంటి ప్రఖ్యాత కంపెనీలు సైతం ఇప్పుడు తిరిగి వస్తున్నాయని రాము తెలిపారు. 

"చంద్రబాబు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, లోకేశ్ అమలు చేస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాలకు ఆకర్షితులై ఆ కంపెనీలు మళ్ళీ ఏపీ వైపు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటుంటే, మనం ఒక అడుగు ముందుకేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో అనుమతులను వేగవంతం చేస్తున్నాం. స్పష్టమైన పాలసీలు, సింగిల్ విండో విధానం పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రధాన కారణాలు" అని ఆయన పేర్కొన్నారు.

"నాడు జీనోమ్ వ్యాలీ, మైక్రోస్టాఫ్ వంటి టెక్ దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకొచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచిన వ్యక్తి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా CII భాగస్వామ్య సదస్సు నిలిచింది. ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించింది. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు. 

రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు. ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయి" అని వివరించారు.

పెట్టుబడుల వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా మూడు ప్రాంతాలకూ సమానంగా పరిశ్రమలు వచ్చేలా మంత్రి లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. "గతంలో హైదరాబాద్‌కు జీనోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నిలిపిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెడుతున్నారు. కేవలం 17 నెలల కాలంలోనే 20కి పైగా పారిశ్రామిక విధానాలు తీసుకువచ్చారు. పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు" అని తెలిపారు.

చంద్రబాబు దూరదృష్టి వల్ల కలిగిన ఫలాలను తనలాంటి ఎందరో అనుభవిస్తున్నారని రాము వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. "ఆయన ఆలోచనల వల్ల నేను, నా పిల్లల తరంతో పాటు లక్షలాది మంది ప్రయోజనం పొందారు. ఇప్పుడు మంత్రి లోకేశ్ కూడా మమ్మల్ని 'మిస్సైల్స్'లా పనిచేయాలంటూ నిత్యం ప్రోత్సహిస్తున్నారు. వారిద్దరి మార్గనిర్దేశంలో నడుచుకుంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాం" అని వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Nara Lokesh
Andhra Pradesh
CII Partnership Summit
Investments
Ease of Doing Business
Speed of Doing Business
AP Industries
Venigandla Ramu
Job Creation

More Telugu News