నిత్యావసర సరుకులను ఉచితంగా ఇచ్చే సూపర్ మార్కెట్.. ఎక్కడంటే!

  • నెలకు రూ.40 వేల విలువైన వస్తువులు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు
  • దేశంలో పేదలు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండవద్దనే ఉద్దేశంతో ఏర్పాటు
  • వీటికి అదనంగా 700లకు పైగా ఫుడ్ బ్యాంకులు కూడా..
దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదనే సదుద్దేశంతో కెనడాలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వినూత్న సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఈ సూపర్ మార్కెట్లలో వస్తువులన్నీ ఉచితంగా లభిస్తాయి. తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగస్తులు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా ఎవరైనా ఈ సూపర్ మార్కెట్ కు వచ్చి తమకు కావాలసిన నిత్యావసర వస్తువులను ఉచితంగా పొందవచ్చు. అయితే, ముందుగా ఈ సంస్థలో తమ పేరు, చిరునామా, ప్రభుత్వ గుర్తింపు కార్డులతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి సభ్యుడు రెండు వారాలకు ఓసారి సుమారు రూ20 వేల విలువైన వస్తువులను ఉచితంగా తీసుకెళ్లే వీలు ఉంటుంది. దీనికి అదనంగా దేశవ్యాప్తంగా 700 ఫుడ్‌ బ్యాంకులను కూడా రెజీనా సంస్థ ఏర్పాటు చేసింది. ఇతరత్రా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, కెనడాలో మొత్తం 5,500ల కంటే ఎక్కువ ఫుడ్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫుడ్ బ్యాంకులలో అర్హులైన వారందరికీ ఉచితంగా ఆహారం అందిస్తారు. అంతేకాకుండా, అనేక సాల్వేషన్ ఆర్మీ కేంద్రాలు ఆహార బ్యాంకులు మరియు సామూహిక భోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.


More Telugu News