ఢిల్లీ కారు పేలుడు.. ఇంటి బాట పట్టిన అల్ ఫలా విశ్వవిద్యాలయం విద్యార్థులు
- పిల్లల చదువులపై తల్లిదండ్రుల ఆందోళన
- విశ్వవిద్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్న దర్యాప్తు బృందాలు
- అనుమానిత విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్న సిబ్బంది
ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉగ్ర కుట్రకు అల్ ఫలా విశ్వవిద్యాలయం కేంద్ర బిందువుగా ఉండటం, ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడంతో ఆ విశ్వవిద్యాలయంపై నిఘా మరింత పెరిగింది. అరెస్టైన ఇద్దరు వైద్యులు ఉగ్రవాది ఉమర్ నబీకి స్నేహితులుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీంతో క్యాంపస్‌లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం విద్యార్థులు స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతున్నారు. అల్ ఫలా విశ్వవిద్యాలయంలో విచారణ వేగంగా కొనసాగుతోంది. దర్యాప్తు బృందాలు సిబ్బందిని ప్రశ్నిస్తూ, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత విద్యార్థుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతుండటంతో తరగతుల కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది.